తిరుమల లో తల నీలాల వెనుక అసలు చరిత్ర!
కలియుగం మొదలు అయిన తర్వాత,విష్ణు మూర్తి శ్రీనివాసుడు అనే పేరుతో మానవ రూపం దాల్చి భూలోకంలో లక్ష్మి దేవి కోసం వెతకడం కొనసాగిస్తూ ఉన్నాడు.
ఆయన మానవ రూపం లో ఉండుట వలన ఆయనకీ కూడా మనుషులకి లాగానే ఆకలి,దాహం వంటివి కలుగుతాయి.అయితే అలా లక్ష్మి దేవికోసం వెతికి వెతికి...అలిసిపోయి ఒక చెట్టు కింద పడిపోయారు.మానవులు ఆయన రూపాన్ని గుర్తు పట్టలేకపోవచ్చు కానీ,దేవుళ్ళు ఆయన్ని గుర్తుపట్ట గలరు.అందుకే దేవుళ్ళు శ్రీనివాసుడని చుట్టూ ప్రక్కల నుండి కాపాడటానికి ఆయన చుట్టూ చీమలతో ఒక కొండ ని నిర్మించారు.
నారదుడు వెళ్లి లక్ష్మి దేవి తో "తల్లి నీ భర్త చీమల కొండలో ఉన్నారు."అని చెప్పాడు. లక్ష్మి దేవి కంగారు పడుతూ బ్రహ్మ దేవుడ్ని మరియు శివుడ్ని తన భర్తని కాపాడమని ప్రార్దించింది . అప్పుడు బ్రహ్మ దేవుడు ఆవు గ ,శివుడు ఆవు పిల్ల గ మారి శ్రీనివాసుడు చుట్టూ ప్రక్కల ఉన్న ఆవుల మంద లో కలిసిపోయారు.శ్రీనివాసుడి ఆకలి తీర్చటానికి ఆవు ఆ చీమల కొండ దగ్గరికి వెళ్ళి శ్రినివాసునుకి పాలు ఇచ్చి ఆయన ఆకలి తీర్చసాగాయి.
ఆవుల్ని కాచే గొల్లవాడు ఎంటబ్బా ఆ ఆవు రోజు పాలు సరిగ్గా ఇవ్వట్లేదు అని ఒకరోజు ఆ ఆవు ని వెంబడించి అది ఎం చేస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు.ఆ ఆవు చిమలకొండలో ఉన్న శ్రినివాసుడుకి పాలు ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయాడు ఆ గొల్లవాడు.దాంతో కోపోద్రిక్తుడై ఆ ఆవు మీదకి గొడ్డలిని విసిరేశాడు ఆ గొల్లవాడు.ఇంతలో శ్రీనివాసుడు ఆ ఆవుని కాపాడటానికి మధ్యలో వచ్చి నిలబడగా గొడ్డలి ఆయనకీ తగిలి తల మీద కొంత భాగంలో వెంట్రుకలు పోతాయి.
అలా ఒకరోజు శ్రీనివాసుడు మళ్ళి లక్ష్మి దేవి కోసం తిరిగి తిరిగి అలిసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా,నీలా దేవి అనే ఒక యువరాణి అటువైపుగా వెళ్తూ విశ్రాంతి తీసుకుంటున్న శ్రినివాసుడని చూచి అక్కడ ఆగి "చాలా అందంగా ఉన్నాడు.ఎవరై ఉంటాడు?".ఇంత అందంగా ఉన్న ఆయనకీ అక్కడ వెంట్రుకలు లేకపోవడం బాలేదు అని,తన తల మీద జుట్టు పీకి శ్రినివసుడుకి తలకి వెంట్రుకలు పెట్టింది.ఇది జరుగుతుండగా శ్రీనివాసుడు నిద్రలో నుంచి లేచి-
"అయ్యో!మీరు ఎందుకు ఇలా చేశారు."అని ఆమె అలా చేసినందుకు నీలా దేవికి వరం ఇస్తాడు శ్రీనివాసుడు.అది ఏమిటంటే
"ఈ కలియుగం అంత నన్ను చూడటానికి వచ్చే నా భక్తులు వాళ్ళ మొక్కులు గ సమర్పించే వాళ్ళ తలనీలాలు అన్నీ అవీ నీకే."అని శ్రీనివాసుడు నీలా దేవికి వరం ప్రసాదిస్తారు.
అది తిరుమలలో తలనీలాల వెనుక అసలు కథ!
Comments
Post a Comment