1940 లో ఒక గ్రామం II
1940 లో ఒక గ్రామం II:-
ప్రిష జాబ్ లో జాయిన్ అవ్వడానికి అంత సిద్దo చేసుకుని “guttaipuram” వెళ్ళడానికి బయలుదేరింది.వచ్చి రేవు వొడ్డున(river shore) పడవ కోసం ఎదురుచూస్తుంది.
ఒక అరగంట గడిచిన తర్వాత అటు వైపుగా ఒక పడవ వచ్చి ఆగింది.
లంగావోణి లో పోడుగుజడతో తలనిండా పూలు పెట్టుకుని ఎటు వెళ్ళాలో తెలియక దిక్కుతోచని పరిస్థితి లో వున్నా ప్రిషను చూసి ఒక పడవ వాడు వచ్చి పడవను ఆపాడు.
పడవ డ్రైవర్:-ఎక్కడికి వెళ్ళాలి అమ్మా?
ప్రిష:–guttaipuram వెళ్ళాలి అన్న.
అది విన్న పడవ డ్రైవర్ కొంచెం సేపు ప్రిషను అయోమయం గ చూసి..
సరే రా! వచ్చి ఎక్కు అని చెప్పి పడవ ఎక్కించాడు.
ప్రిష కుడా కొంచెం భయపడుతూ తన సామగ్రి అంతా వేసుకుని పడవ ఎక్కింది.పడవ బయలుదేరింది.
వెళ్ళే దారిలో….
పడవ డ్రైవర్:-అవును నిన్ను ఎప్పుడూ ఆ ఊర్లో చూడలేదే?ఎవరమ్మా నువ్వు?చూడానికి చక్కని చుక్క లాగ వున్నావ్ ఆ ఊర్లో పనేంటి నీకు?ఎవరింటికి వెళ్తున్నావ్?
ప్రిష:-ఎవరింటికి వెళ్ళట్లేదు.ఆ ఊరు నాకు కొత్త.నేను ఆ ఊరికి కొత్తగా వచ్చిన పంతులమ్మ ని.
పడవ డ్రైవర్:-పంతులమ్మవా!! పోయి పోయి ఈ ఊర్లో ఉద్యోగం ఎందుకు వేయించుకున్నావ్ తల్లి??
ప్రిష:-అది మన చేతుల్లో ఉండదు అన్నా,సర్కారే(government) వేస్తుంది.అయిన ఆ ఊరు మంచిది కాదా?
పడవ డ్రైవర్:-అట్లన తల్లి సర్కారు వేసింద సర్లే అయితే మంచిది కాదా అంటే మంచిదే కానీ కొంచెం జాగ్రత్త వుండాలి కాకపోతే.
ఇంతలో guttaipuram వచ్చింది.పడవవాడు పడవను వడ్డుకు తెచ్చి ప్రిషను దింపాడు.
ప్రిషను చూసి ధృడమైన శారిరకృతి కలిగిన మనిషి ఒకడు వచ్చాడు.
మనిషి:-మీరేనా ఈ ఊరికి కొత్తగా వచ్చిన పంతులమ్మ ?
ప్రిష:-‘నేనే?మీరు ఎవరు?’ అని అతన్ని చూసి కొంచెం వణుకుతూ అడిగింది.అతను చూడటానికి గంభీరంగా ,కండలుతిరిగి,నున్నటి గుండు తో గోచి కట్టుకుని నల్లగా వున్నాడు.
అతణ్ణి చూసి కొంచెం భయంవేసింది ప్రిష కి..
గోచి మనిషి:-నేను పెద్దయ గారి మనిషిని.మీకు వసతి ఏర్పాటు చేయమని పెద్దయగారు నన్ను పంపారు.
అలా ఆ గోచిమనిషి ప్రిష ని ఒక ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంట్లో దిగాపెట్టాడు.పనిలో పని తను పాఠాలు చెప్పబోయే స్కూల్ కూడా చూపించాడు.ఆ స్కూల్ బాగా పాడైపోయి సిధలవస్థకు చేరుకున్నట్లు ఉంది.అందుకని ఒక పెద్ద నల్ల బోర్డు రావిచెట్టు క్రింద పెట్టి పాఠాలు చెప్పమన్నాడు.
గోచిమనిషి ప్రిష తో:-“ఈ ఊర్లో పెద్దయగారు ఆయన కుటుంబం ఎంత చెబితే అంత.వారి మాటలకి ఎదురుచేప్తే నీ ఉద్యోగం నువ్వే నాశనం చేసుకున్నట్లు అవుతుంది.ఈ ఊరు కట్టుబాట్లుకి కట్టుబడి ఉండండి.లేదంటే పంతులమ్మ అని కూడా చూడకుండా శిక్షిస్తారు.ఇంకో విషయం మీరు ఇంట్లోఎలాగైనా ఉండచ్చు,కాని ఊర్లో తిరిగేటప్పుడు మాత్రం పసుపుపచ్చ,ఆకుపచ్చ చీరలని మాత్రమే ధరించాలి.మీరు ఎప్పుడు పెద్దయగారి ఇంటికి వెళ్ళాలనుకున్న బట్టలన్నీ తీసేసి ఒక గోచి కట్టుకుని వెళ్ళాలి.ఛాతి భాగం ఒక కండువ(towel) తో కప్పుకోవాలి.”ప్రస్థుతానికి ఇవి కొన్ని నిబంధనలు పోనుపోనూ మీకే అన్నీఅర్ధంఅవుతాయి.జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ స్కూల్ వున్నా విధానానికి ఈ గోచిమనిషి చెప్పిన మాటలకి ఏమి చేయాలో ఏమి తోచలేదు ప్రిషకి.
పక్కరోజు……………
ప్రిష జాబ్ లో మొదటి రోజు అని నీట్ గ పసుపుపచ్చ చీర కట్టుకుని,పొడుగు జడతో మల్లెపూలు పెట్టుకుని పాఠసాల కి బయలుదేరింది.
అక్కడ తరగతుల వారిగా ఎవరు కూర్చోలేదు.అన్నీ తరగతుల పిల్లలు కలిసి
కూర్చున్నారు.ప్రిష పిల్లలకి పాఠం చెప్తుండగా అటు వైపుగా ఇద్దరూ ఆడవాళ్ళూ పెద్ద పెద్ద జడలతో,జడ నిండా పూలతో వచ్చారు.వారిని చూసి పిల్లలు అందరూ లేచి నిలబడి మర్యాద ఇచ్చినట్లు వంగున్నారు.
ఆ ఇద్దరూ ఆడవాళ్ళలో ఒక ఆవిడ ముందుకు వచ్చి రెండో ఆవిడను చూపిస్తూ ఈమె నా చెల్లి నువ్వు ఇంటర్ విద్యార్థులకి కూడా చదువుచేప్తున్నావ్ అంట కదా?దీనికి కూడా చెప్పి ఫస్ట్ క్లాసు లో పాస్ చీయించే బాధ్యత నీదే అని కొంచెం గర్వంగా చెప్పి,నేనే ఎవరో చెప్పలేదు కదా..నా పేరు ‘రేఖ’ ఈ ఊరు పెద్దయ గారి పెద్ద కుమార్తెను.అది రెండో కూతురు ‘చేతన’. అందుచేత వొళ్ళు దగ్గర పెట్టుకుని చదువు చెప్పు అని వెళ్ళబోతూ ప్రిషని చూసి ఆగింది..రేఖ కోపంగా ప్రిష వైపుగా వచ్చి ప్రిషని రావి చెట్టు వెనక్కి తీసుకెళ్ళి తన జడ అంత విప్పి చిన్న పిల్లలకి లాగ రెండు పిలకల జడ వేసి “ఈ రోజు అంత నువ్వు ఇలానే పాఠాలు చెప్పాలి పిల్లలకి”అని కోప్పడి వెళ్ళిపోయింది.
ప్రిష కూడా పెద్దయ గారి కుటుంబాన్ని ఎదురించాకుడదని ఏమి చేయకుండా అల మౌనం గ నిలబడిపోయి పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఆ రెండు పిలకలతోనే వచ్చింది.
పంతులమ్మని రెండు పిలకలతో చూసి పిల్లలందరూ నవ్వుకున్నారు.
ఇకా ఆ రోజు అంత రెండు పిలకలతోనే పాఠాలు చెప్పింది.
ఆ రోజు సాయంత్రం…………..
ప్రిష ఇంటికి వెళ్తుండగా……వెనకాల నుంచి టీచర్ అని ఒక అమ్మాయి గొంతు విన్పించింది.ప్రిష వెనక్కి తిరిగి చూసింది.
ఆ అమ్మాయి “నమస్కారం!టీచర్ నా పేరు వింధ్య,నేను కూడా ఇంటర్ చదువుతున్నాను.నిన్న చూసాను మీరు రావటం నేను మీ పక్కింట్లోనే వుంటాను.”
“అవునమ్మా వింధ్య అదే ఈ ఊరు నాకు కొత్త ఎవరూ లేరెబ్బ అనుకున్నాను పక్క ఇల్లేనా అయితే” అంది ప్రిష.
“అవును టీచర్!ఈరోజు ఒక్కసారి మా ఇంటికి రండి టీచర్”అంది వింధ్య.
ఈలోపు ఇద్దరి ఇళ్ళు వచ్చేసాయి.ఈరోజు కాదులే అమ్మ వింధ్య రేపు వస్తానులే.అంది ప్రిష
పక్కరోజు…………
మళ్ళి పసుపచ్చ చీరకట్టుకుని తల నిండా పూలతో స్కూల్ కి బయలుదేరింది ప్రిష.
పాఠాలు చెప్తుండగా మళ్ళి రేఖ వాళ్ళ చెల్లి ని తరగతి లో దించటానికి వచ్చింది.వెళ్తూవెళ్తూ మరల ప్రిష వైపు చూసి కోపం గ తనని రావి చెట్టు వెనక్కి తీసుకెళ్ళి జడమోత్తం విప్పి మరల రెండు పిలకలు వేసి ఒక్కొక్క పిలక నుండి ఒక్కొక్క అంగుళం జుట్టు ని కత్తిరించింది.
ప్రిషకి తనకి తెలియకుండానే కంట్లో నీరు గిర్రున తిరిగాయి.
“ఈ రోజు మొత్తం కత్తిరించిన జుట్టుని చేతిలో పట్టుకుని పాఠాలు చెప్పు” అని చెప్పి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయింది రేఖ.
ప్రిష అలానే తన కతిరించిన జుట్టుని చేతిలో పట్టుకునే పాఠాలు చెప్పింది.
ఆ రోజు సాయంత్రం…………….
అల డల్ గ ఇంటికి వెళ్తున్న ప్రిషను చూసి వింధ్య వచ్చి “టీచర్ ఈ రోజు మా ఇంటికి వస్తా అన్నారు మీరు ఎలాగైనా రావాలి.”
సరే అని ప్రిష కూడా వింధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది.అక్కడ వింధ్య వాళ్ళ అమ్మ ప్రిషను లోపలి పిలిచి అతిధి మర్యాదలు చేసింది.
ప్రిష వింధ్య వాళ్ళ అమ్మతో:-“మీ అమ్మైకి అంత వోతైన పొడుగు జుట్టు ఎలా వచ్చిందో ఇప్పుడు అర్దమైంది ఆంటీ అని చెప్పి నవ్వింది” ప్రిష
మీ తల్లి కుతుర్లిద్దరు చాల అందంగా మంచి జుట్టు తో వున్నారు ఆంటీ అని చెప్పి .
అల ఒక గంట సేపు ప్రిష వింధ్యతో…. ,వింధ్య వాళ్ళ అమ్మతో…… వింధ్య వాళ్ళ ఇంట్లో గడిపి తన ఇంటికి వెళ్ళిపోయింది.
ఆ రోజు రాత్రి …….
ప్రిష ఎవరికో ఉత్తరం రాస్తుంది ఆ ఉత్తరం లో ఇలా ఉంది.”మీరు ఎప్పటినుండో ఒక నల్లటి కురులు కలిగిన విగ్గు కావాలని కోరుకుంటున్నారు కదా మీ కోరికని త్వరలోనే తీర్చబోతున్నాను”అని రాసి ఉంది.
ఆ ఉత్తరం పట్నానికి పంపించేసింది ప్రిష.
౩ రోజుల తర్వాత……
ప్రిష క్లాసు లో పాఠం చెప్తుండగా క్లాసు లో ఎవరిదో నున్నటి గుండు మెరుస్తూ కనిపించింది.ఎవరబ్బా???అని దగ్గరికి వెళ్లి చూస్తే ఆ గుండులో వున్నా అమ్మాయిని చూసి ఆశ్చర్యానికి గురైంది ప్రిష……….
తరువాయి భాగం ఎల్లుండి…….
Comments
Post a Comment